రాజధాని పునర్నిర్మాణ ప్రారంభోత్సవ సభకి ప్రధాని మోదీతో పాటు అతిరథ మహారథులు తరలివస్తున్న నేపథ్యంలో సభాప్రాంగణానికి వెళ్లే రహదారులను శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ మేరకు ప్రకాశం బ్యారేజీ వైపు ఎటువంటి వాహనాలను వెళ్ళకుండా చర్యలు చేపట్టారు. విజయవాడ వైపు వెళ్లే వాహనాలను కనకదుర్గమ్మ వారధివైపునకు మళ్లిస్తున్నట్లు తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజ్ తెలిపారు. వాహనదారులు సహకరించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa