మంగళగిరి టీడీపీ అభ్యర్థి, మంత్రి నారా లోకేశ్ ఆదివారం మంగళగిరి నియోజకవర్గం,దుగ్గిరాల మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హోదా ఇవ్వాల్సిన ప్రధాని మోడీ మట్టి, నీళ్లు ఇచ్చిపోయారని, వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు గెలుచుకుని మన చంద్రన్నే ప్రధానిని నిర్ణయిస్తారని, ప్రత్యేక హోదా తెస్తారని పేర్కొన్నారు. ముందుగా శ్రీ కనకపుట్లమ్మ తల్లి దేవస్థానంలో లోకేశ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన ప్రచార రథంపై నుంచి ప్రసంగించారు. కేంద్రంలోని మోడీ, ప్రతిపక్ష నేత జగన్, పక్క రాష్ర్టం ముఖ్యమంత్రి కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. హోదా ఇవ్వాల్సిన మోడీ...అడిగితే ఈడీ దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఎంపీ గల్లా జయదేవ్ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని పిలిచి..హోదా ఎందుకు ఇవ్వవు అని నిలదీశారని, తనను ప్రశ్నించడం కూడా తట్టుకోలేని మోడీ మన ఎంపీగారికి ఈడీ నోటీసులు పంపించారని పేర్కొన్నారు. మనమంతా ఐకమత్యంగా 25 ఎంపీ సీట్లు గెలిపించుకుంటే...మన చంద్రన్న ఎవరు ప్రధాని కావాలో నిర్ణయిస్తారని, ఆ తరువాత మనమే ప్రత్యేక హోదా తెచ్చుకుంటామని లోకేశ్ చెప్పారు.
పెద్దకొండూరు పెద్దల ఆశీర్వదించాలని కోరారు. మంగళగిరిని దేశంలోనే అత్యుత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అభివృద్ధి చూసి ఓటేయండి...ఇంకా అభివృద్ధి కావాలంటే తెలుగుదేశాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం గొడవర్రు, వీర్లపాలెం, పెదపాలెం, చినపాలెంలో ఎన్నికల ప్రచార సభలలో ప్రసంగించారు. ప్రతీ గ్రామంలోనూ అనూహ్యమైన స్పందన వచ్చింది. మండుటెండలోనూ లోకేశ్ ప్రచారరథం వెంట జనం నడుస్తూ వచ్చారు. మేళతాళాలతో ఊరేగింపుగా తమ గ్రామంలోని సాదరంగా స్వాగతం పలికారు. ప్రతీ చోట వృద్దులను పలకరిస్తూ, వారి సమస్యలూ తెలుసుకుంటూ ప్రచారాన్ని సాగించారు లోకేశ్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa