ఏకధాటిగా 12 గంటల పాటు పబ్జీ గేమ్ ఆడిన ఓ యువకుడు పక్షవాతానికి గురయ్యాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. అతను నడవలేకపోవడం, మూత్ర విసర్జన చేయలేకపోవడంతో ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పక్షవాతం సంభవించినట్లు నిర్ధారించారు.
వైద్యుల పరీక్షల్లో గేమింగ్ కారణంగా యువకుడి వెన్నెముకలో కైఫో-స్కోలియోటిక్ వైఫల్యం ఏర్పడినట్లు తెలిపారు. నావిగేషన్ టెక్నాలజీ సాయంతో అతడి వెన్నెముకకు సర్జరీ చేశారు. ప్రస్తుతం యువకుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటన గేమింగ్ అడిక్షన్‌పై మరోసారి ఆందోళనలను రేకెత్తిస్తోంది. నిరంతర గేమింగ్ శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa