అనంతపురం: సీఐ మురళీకృష్ణను బెదిరించిన ఆరోపణలపై బోరుగడ్డ అనిల్ కుమార్‌పై 2018లో అనంతపురం మూడో పట్టణ పోలీసు స్టేషన్లో నమోదైన కేసు విచారణ వాయిదా పడింది.
శుక్రవారం నిర్వహించాల్సిన విచారణకు సాక్ష్యులకు సమన్లు అందకపోవడంతో కోర్టు ఈ కేసును ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో పలువురు సీఐలు సాక్ష్యులుగా ఉన్నారు. సాక్ష్యులు హాజరైతే విచారణ ప్రారంభమవుతుందని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa