అమరావతి, మే 03, 2025: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. ‘తల్లికి వందనం’ పథకం కింద ప్రతి విద్యార్థికి రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పలు వేదికలపై హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో, ఈ నెలాఖరులోగా ‘తల్లికి వందనం’ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను రాబోయే రెండు లేదా మూడు రోజుల్లో ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు ఆర్థిక భరోసా కల్పించి, విద్యా రంగంలో ప్రోత్సాహం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరిన్ని వివరాల కోసం ప్రభుత్వ అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa