ఒక వ్యక్తి రోజుకు 3 నుంచి 5 చెంచాల మోతాదు కన్నా ఎక్కువ నూనెను తీసుకోకూడదు. సరిగ్గా చెప్పాలంటే నెలకు అరలీటరు మాత్రమే. ఇక కుటుంబంలో నలుగురు సభ్యులుంటే నెలకు 2 లీటర్ల కన్నా ఎక్కువ నూనె వినియోగించకుండా చూసుకోవడం ఉత్తమం. ఈ ప్రకారం ఒక నలుగురు సభ్యులున్న కుటుంబం ఏడాదికి 24 లీటర్ల నూనె మాత్రమే వాడాలి. అంతకుమించి వాడితే కొలెస్ట్రాల్ సంబంధింత రోగాలు రావడం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa