అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ టీడీపీలో చేరారు. కాకినాడలో జరిగిన సభలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో హర్షకుమార్ టీడీపీలో చేరారు. హర్షకుమార్‌కు చంద్రబాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఎలాంటి షరతులు లేకుండానే టీడీపీలో చేరానని, చంద్రబాబు ఆదేశిస్తే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేయాలని చూశారని ఆరోపించారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa