స్టాన్‌ఫోర్డ్‌లో చదివాడు..సాఫ్ట్‌గా ఉన్నాడనుకుంటున్నారా? లోపల పల్లెటూరంతా అలాగే ఉంది. నాన్నది నారావారిపల్లె, అమ్మది నిమ్మకూరు అని ప్రసంగంలో ప్రస్తావిస్తూ తానూ పల్లెటూరి పిలగాడినే అంటూ నారా లోకేశ్ జనాన్ని మెప్పించారు. నేను మీ నారా లో్కేశ్‌ని అంటూ ప్రతీ గ్రామంలో ప్రచార సభ ముందుగా తనను తాను పరిచయం చేసుకుంటున్నారు. ఆదివారం మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలంలో పెద్దకొండూరు, గొడవర్రు, వీర్లపాలెం, పెదపాలెం, చినపాలెంలో నారా లోకేశ్ పర్యటించారు. మంత్రితోపాటు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. గల్లా జయదేవ్ కూడా విదేశాలలో చదువుకుని వచ్చినవారే కావడం విశేషం.టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులిద్దరూ విదేశాల్లో చదువుకున్నా...పల్లెల్లో ప్రచారం చేసేటప్పుడు చాలా చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఉన్నారు. గ్రామస్తులతో మమేకం అవుతూ వారి కష్టనష్టాలు తెలుసుకున్నారు. ప్రతీ గ్రామంలోనూ అక్కడి స్థానికులు చూపించిన ఆదరాభిమానాలతో మంత్రి నారా లోకేశ్ ఉబ్బితబ్బిబయ్యారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను అంటూనే...నేను మీలో ఒకడిని..మీ కుటుంబసభ్యుడిని అని భరోసా ఇచ్చారు. మీ అందరి సహకారంతో నేను విజయం సాధిస్తాను..దేశమంతా మంగళగిరివైపు చూసేలా అభివృద్ధి చేస్తాను అని లోకేశ్ హామీ ఇవ్వగానే గ్రామస్తులు చప్పట్లతో తమ ఆనందం వెలిబుచ్చారు. ప్రతీ గ్రామంలో జరిగిన అభివృద్ధి ప్రస్తావిస్తూ, అక్కడి సమస్యలు కూడా విని తాను గెలిచిన వెంటనే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. ఇంకోవైపు ప్రతీగ్రామం ప్రత్యేకతలు ప్రస్తావిస్తూ వారి అభిమానాన్ని చూరగొంటున్నారు. యువకుడైనా, మొదటి సారి తానే ఎన్నికల బరిలో దిగినా, రాష్ర్టం దృష్టంతా నారా లోకేశ్‌పైనే ఉన్నా.. ఎక్కడా తొణకకుండా, బెణకకుండా దూసుకుపోతున్నారు. చిన్న చిన్న పల్లెల్లోనూ తనను చూసేందుకు వచ్చిన జనాలతో ..మీరు చూపిస్తున్న ప్రేమ మరువలేను..మీ అభివృద్ధి-సంక్షేమం బాధ్యత నేను తీసుకుంటానంటూ భరోసానివ్వడంతో స్థానికులు ఆనందపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa