రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలలకు ఈ నెల 29 నుంచి వేసవి సెలవులు అమలు కానునున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని జూనియర్ కాలేజీలకు మార్చి 29 నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు ప్రకటించింది. మార్చి 29 నుంచి జూన్ 2 వరకు వేసవి సెలవులు ఉంటాయని తెలిపింది. జూన్ 3న కళాశాలలు తిరిగి తెరచుకుంటాయని బోర్డు స్పష్టం చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలలకు ఈ సెలవులు వర్తించనున్నాయి. సెలవురోజుల్లో తరగతులు నిర్వహించకూడదని.. నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తే మాత్రం చర్యలు తప్పవని ఇంటర్ బోర్డు అధికారులు హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa