అనంతపురం, మే 04, 2025: ఆదివారం మధ్యాహ్నం అనంతపురంలో ప్రభుత్వ ఉద్యోగుల నగర శాఖ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో నగర శాఖ అధ్యక్షుడిగా షేక్ రఫీ, ప్రధాన కార్యదర్శిగా వినోద్ కుమార్, సహాధ్యక్షుడిగా శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, ఉపాధ్యక్షులకు ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు బాజీ పటాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నగర శాఖ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa