AP: కర్నూలు నగరం మీదుగా వెళ్లే జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఓ లారీ ట్యాంకరు నుంచి హైడ్రో క్లోరిక్ యాసిడ్ పెద్దఎత్తున లీకైంది. దీనిని గుర్తించిన వాహన డ్రైవరు రహదారిపైనే వాహనం వదిలి దూరంగా వెళ్లిపోయారు. భరింపరాని దుర్గంధం వస్తుండటంతో ఆ దారిన వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యాసిడ్ కారణంగా చాలామంది శ్వాస అందక అల్లాడిపోయారు. దీంతో సంతోష్ నగర్ నుంచి తుంగభద్ర నది వరకు ట్రాఫిక్ పెద్దఎత్తున ఆగిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa