పహల్‌గామ్ ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోదీకి ముందే సమాచారం ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు చేశారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందనే ఇంటెలిజెన్స్ సమాచారం ప్రధాని మోదీ వద్ద ఉందని ఖర్గే ఆరోపించారు. ఆ తర్వాత ప్రధాని తన పర్యటనను రద్దు చేసుకున్నారని ఖర్గే పేర్కొన్నారు. ఏప్రిల్22న పహల్‌గామ్ దాడి ఘటనకు మూడు రోజుల ముందు నిఘా సంస్థ నివేదిక పంపిందని ఖర్గే వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa