నరసరావుపేటలోని మల్లమ్మ సెంటర్‌లో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 130వ జయంతిని బుధవారం ఆర్యవైశ్యులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఈ వేడుకల్లో ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వాసవి మాత ఆర్యవైశ్యులకే కాకుండా అందరికీ ఆరాధ్య దేవత అని కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa