గుజరాత్ టైటాన్స్ ఆటగాడు జాస్ బట్లర్ ముంబై వీధుల్లో క్రికెట్ ఆడుతూ కనిపించాడు. చిన్నపిల్లలతో కలిసి చిన్న కర్రముక్కతో క్రికెట్ ఆడాడు. ఆ వీడియోలను జాస్ బట్లరే నేరుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఓ బుడ్డోడు వేసిన బంతిని గ్రేట్ యార్కర్ అంటూ కితాబు కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ముంబై ఇండియన్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య ఉత్కంఠ పోరులో గిల్ సేన థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది. ముంబై వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 27 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 30 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ విజయంలో బట్లర్ పాత్ర చాలా కీలకంగా కూడా మారింది. ఈ మ్యాచ్ అనంతరం జాస్ బట్లర్ ముంబైలోనే ఉండిపోయాడు. గుజరాత్ తన తర్వాత మ్యాచ్‌ను మే 11న ఆడనుంది. దాంతో నాలుగు రోజులు సమయం దొరకడంతో ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టాడు.
ముంబై వీధుల్లో తిరుగుతున్నప్పుడు చిన్న పిల్లలు కొంతమంది అక్కడ క్రికెట్ ఆడుతూ కనిపించారు. గల్లీల్లో ఉండే బుడ్డోళ్లు ఒక కర్ర, బాల్‌తో అక్కడ ఆడుతుండగా బట్లర్ కూడా వాళ్లతో కలిసిపోయాడు. బుడ్డోడు బౌలింగ్ వేయగా అది యార్కర్ పడింది. దానికి గ్రేట్ యార్కర్ అంటూ వీడియో మీద టైప్ చేసి బట్లర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌గా పెట్టాడు. దాంతో పాటు మరో వీడియో కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌గా పోస్ట్ చేశాడు.
ఐపీఎల్ 2024 వరకు రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన బట్లర్‌ను ఈ మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఈ సీజన్‌లో బట్లర్ అదరగొట్టాడు. ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన బట్లర్ ఐదు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. 97 హైయెస్ట్‌తో సరిగ్గా 500 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2025 ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో బట్లర్ టాప్ -5లో నిలవగా.. 510 పరుగులతో సూర్యకుమార్ యాదవ్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.
గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ షోతో ఐపీఎల్ 2025లో దూసుకుపోతోంది. ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ జట్టు ఎనిమిది గెలిచి, మూడు ఓడింది. మొత్తం 16 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. పర్పుల్ క్యాప్ లిస్ట్‌లో గుజరాత్ బౌలర్ ప్రసిద్ కృష్ణ 11 వికెట్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. ఆరెంజ్ క్యాప్ లిస్ట్ టాప్ 5లో సాయి సుదర్శనర్, శుభమన్ గిల్, జాస్ బట్లర్ ఉండటం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa