దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జరిగే వేడుకల్లో బాణాసంచా, డ్రోన్లపై నిషేధం విధించింది. దీనికి సంబంధించి పోలీస్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా నిబంధనలను తప్పితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ నిబంధనలు మే 15 వరకు ఉంటాయని, ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపింది. కాగా ఇప్పటికే రాష్ట్రంలోని పరిస్థితులపై ప్రధాని మోదీ సీఎంకు ఫోన్ చేసి ఆరా తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa