పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మొత్తంగా 26 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు జ్వలించగా.. భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. మంగళవారం రోజు పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్ఖావరాలపై వైమానిక దాడులు చేసింది. దీంతో దాయాది దేశం కూడా ప్రతిచర్యలకు దిగగా.. భారత్-పాక్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
ఈక్రమంలోనే ఇండియా మే 7వ తేదీన ఢిల్లీ సహా అనేక నగరాల్లో సివిల్ సెక్యూరిటీ కింద మాక్ డ్రిల్స్, బ్లాక్‌అవుట్ వ్యాయామాలు చేపట్టింది. గత 54 ఏళ్లలో దేశంలో తొలిసారిగా ఇలాంటి సైనిక సన్నాహాకాలు సాగగా.. బ్లాక్‌అవుట్ అంటే ఏమిటి, ఎందుకు ఆ సమయంలో లైట్లు, ఫ్యాన్లు సహా అన్నీ ఆఫ్ చేయాలనే అనుమానాలు ప్రజల్లో కల్గుతున్నాయి.
బ్లాక్‌అవుట్ అంటే ఏమిటి..?
బ్లాక్‌అవుట్ అంటే ఓ ప్రాంతంలోని అన్ని లైట్లు, ఫ్యాన్లను ఆర్పేయాలి. ఎక్కడా వెలుతూరు కనిపించకూడదు. కనీసం వాహనాలను సైతం రోడ్డుపై నడపకూడదు. అలాగే హెడ్ లైట్లు కూడా కనిపించకుండా చేయాలి. ముఖ్యంగా 5000 అడుగుల ఎత్తు నుంచి చూస్తే ఎలాంటి వెలుతూరు కనిపించకుండా ఉండాలి. ఇలా ప్రాంతం మొత్తాన్ని పూర్తి చీకటిగా మార్చడాన్ని బ్లాక్‌అవుట్ అంటారు.
బ్లాక్‌అవుట్ సమయంలో ఏం చేయాలి?
బ్లాక్‌అవుట్ సమయంలో భవనాల వెలుపల ఉన్న లైట్లు ఆర్పేయాలి. అలాగే వాహనాల హెడ్‌లైట్లు కూడా కనిపించకుండా కప్పేయాలి. అలంకారంతో పాటు ఏవైనా ప్రకటనల కోసం పెట్టిన లైట్లను సైతం ఆర్పేయాలి. బ్లాక్‌అవుట్ సమయంలో చేతిలోటార్చ్‌లు ఉన్నా.. వాటిని కూడా కాగితంతో కప్పివేస్తారు. అలాగే 75 శాతం వీధిలైట్లను పూర్తిగా ఆర్పేస్తారు. మిగతా వీధి దీపాల సామర్థ్యాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తారు. షాపులు నిర్వహించే వాళ్లు, నివాస ప్రాంతాల్లోని వారు వెలుతూరు బయటకు రాకుండా కిటికీలు పెట్టడం, కర్టెన్లు మూయడం వంటివి చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ఆ ప్రాంతమంతా పూర్తి చీకటిగా మారుతుంది.
బ్లాక్‌అవుట్ వల్ల కల్గే లాభాలు..!
శత్రువులు రాత్రి వేళల్లో పట్టణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని వైమానికి దాడులకు పాల్పడుతుంటారు. అయితే వెలుతురు నిలిపివేస్తే, వారికి లక్ష్యాలు కనిపించకుండా ఉంటాయి. ఫలితంగా దాడులను నిరోధించవచ్చు. ఇది మాత్రమే కాకుండా శత్రుమూకలు ఉపగ్రహాల ద్వారా నగరాల చలనాలను గమనించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయాల్లో బ్లాక్‌అవుట్ చేస్తే వారి పర్యవేక్షణకు తాత్కాలికంగా అడ్డుగోడ వేయొచ్చు. అలాగే తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లో విద్యుత్ వనరులను ముఖ్య ప్రాంతాలకు పరిమితం చేయాల్సిన అవసరం వస్తుంది. అలాంటప్పుడు బ్లాక్‌అవుట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆధునిక యుద్ధాల్లో సిగ్నల్ జామింగ్, డ్రోన్ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఇలాంటి దాడులు చేసే అవకాశం ఉన్నప్పుడు బ్లాక్‌అవుట్ చేస్తే సమర్థవంతమైన రక్షణ సాధ్యం అవుతుంది.
అందుకే ప్రజల్లో భయాన్ని తగ్గించి.. మానసికంగా వారిని అన్నింటికీ సిద్ధం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించింది. దీని వల్ల ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనే దానిపై పూర్తిగా అవగాహన వస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa