ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసిపికి వాసిరెడ్డి గుడ్‌బై-దేశంలో చేరిక‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 18, 2019, 08:59 PM

విజయనగరం జిల్లాలో వైసిపి మ‌రో ఠ‌ల‌క్ త‌గిలింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ పార్టీలో కీల‌కంగా ప‌నిచేస్తున్న  మాజీ ఎమ్మెల్యే వాసిరెడ్డి వరదారామారావు    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తు ,  వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజీనామా లేఖ పంపారు. 2017 ఫిబ్రవరిలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన వాసిరెడ్డితో బొత్స స‌త్య‌నారాయ‌ణ త‌దిత‌రుల మంత‌నాల‌తో  మే నెలలో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పడం విజయనగరం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 


 తెలుగుదేశం పార్టీలో వాసిరెడ్డి వరదా రామారావు బొబ్బిలి నుంచి ఎమ్మెల్యేగా పలుమార్లు గెలుపొందారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగానూ పని చేశారు. వాసిరెడ్డి వరదారామారావుకు బొబ్బిలి నియోజకవర్గంలో మంచి పట్టుంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీ బొబ్బిలి నియోజకవర్గంలో విజయం సాధించాలని మంచి పట్టుదలతో ఉన్న‌ప్ప‌టికి క‌నీసం త‌న‌ని సంప్ర‌దించ‌కుండానే, వాస్త‌వ ప‌రిస్థితి గుర్తించ‌కుండా టిక్కెట్ల కేటాయింపులు జ‌రిపార‌ని వాసిరెడ్డి కొంత కోపంతో ఉన్నారు. అయితే ఆయ‌న‌ని  విజ‌య‌న‌గ‌రం స‌భ‌కొచ్చిన జ‌గ‌న్ పిలిపించుకోవ‌టం కానీ, బుజ్జ‌గించే ప‌నిలో క‌నీసం బొత్స కూడా ప‌ట్టించుకోక పోవ‌టంవ‌ల్లే ఆయ‌న తిరిగి తెలుగుదేశంలో చేరాని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే 


మాజీ కేంద్రమంత్రి, విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజు ,మంత్రి సుజయ్ కృష్ణ రంగరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఎన్నిక‌ల‌ తరుణంలో వాసిరెడ్డి వరదారామారావు ఊహించని ట్విస్ట్ ఇవ్వడం వైసీపీని కలవరపాటుకు గురిచేస్తోంది.  బొబ్బిలిలో మంత్రికి కొండ‌త బ‌లం వ‌చ్చిన‌ట్టేన‌ని తెలుగుదేశం వ‌ర్గాలు భావిస్తున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa