భారత్ పాకిస్థాన్ సరిహద్దుల వద్ద గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడింది. కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ శనివారం సాయంత్రం ప్రకటించింది. శనివారం సాయంత్రం 5గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని ప్రకటించింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం విదేశాంగ శాఖ ప్రకటనకు ముందు ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. భారత్ పాకిస్థాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఈ విషయంలో అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారత్ పాకిస్థాన్ కాల్పుల విరమణ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ఉద్రిక్తతలను చల్లార్చేందుకు అవసరమైతే తాను పాకిస్థాన్ వెళ్తానంటూ కేఏ పాల్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
" భారత్ పాకిస్థాన్ ఉద్రిక్తతల గురించి తాజాగా ఓ శుభవార్త వచ్చింది. భారత్ పాకిస్థాన్ విషయంలో జోక్యం చేసుకోమని అమెరికా వైఎస్ ప్రెసిడెంట్ నిన్న చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం చెప్పారు. అది పూర్తిగా తప్పు. నేను ఇప్పటికే రిపబ్లికన్లు, డెమొక్రటిక్ నేతలను కలిసి ఉన్నా. అలాగే పాకిస్థాన్, భారత్ నేతలతోనూ నేను టచ్లో ఉన్నా. ఎట్టకేలకు శుభవార్త చెప్పారు. నిన్నటి వరకూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పాకిస్థాన్ విషయంలో జోక్యం చేసుకోమని చెప్పారు. కానీ నేను ఆశలను విడిచిపెట్టలేదు. ప్రార్థిస్తూనే ఉన్నా.. రాత్రీ పగలు పనిచేస్తూ ఉన్నా. ఇప్పుడు అందరూ యుద్ధం చేయమని ఒప్పుకున్నారు. యుద్ధం ద్వారా నష్టమే కానీ లాభం లేదు. ఈ విషయాన్ని గమనించాలి. లక్షల మంది అమాయక ప్రజలు చనిపోతారు. లక్షల కోట్లు ఆస్తి నష్టం కలుగుతుంది. అలాగని టెర్రరిస్టులు దాడి చేస్తే ఊరుకోకూడదు. శాంతి కోరుకునేవారందరూ మే 24న జింఖానా మైదానంలో జరిగే మీటింగ్కు రండి." అంటూ కేఏ పాల్ పిలుపునిచ్చారు.
మరోవైపు కాల్పుల విరమణకు సంబంధించి పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అధికారులు శనివారం మధ్యాహ్నం భారత డీజీఎంఓకు ఫోన్ చేశారని.. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఆ తర్వాత రెండు దేశాల ఉన్నతాధికారులు చర్చలు జరిపి కాల్పుల విరమణకు అంగీకరించినట్లు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఈ చర్చల తర్వాత నేవీ, ఎయిర్ఫోర్స్, ఆర్మీ తమ దాడులను తక్షణమే నిలిపివేయాలని అవగాహనకు వచ్చినట్లు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa