శ్రీకాకుళం పెద్దపాడులోని శ్రీరామాంజనేయ వ్యాయామశాలలో సోమవారం రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి ఎన్. కొండలరావు తెలిపారు. సబ్ జూనియర్, అండర్-23విభాగాల్లో ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఆధార్, జనన ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. అర్హత సాధించిన క్రీడాకారులు ఈ నెల 16నుంచి చిత్తూరులో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa