ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటెక్నిక్ కాలేజీలలో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్-2025 (POLYCET-2025) ఫలితాలు ఇవాళ కాసేపట్లో విడుదల కానున్నాయి. రాష్ట్ర టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు (SBTET) ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది.
అధికారుల సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఫలితాల డేటాను సర్వర్లలోకి అప్లోడ్ చేసే ప్రక్రియ జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే, ఫలితాలను అధికారికంగా విడుదల చేస్తారు. విద్యార్థులు తమ రిజల్ట్స్‌ను ఆధికారిక వెబ్‌సైట్ అయిన https://polycetap.nic.in/ ద్వారా తనిఖీ చేయవచ్చు.
ఫలితాలు విడుదలైన తర్వాత, అభ్యర్థులు హాల్ టికెట్ నంబర్ ద్వారా తమ వ్యక్తిగత రిజల్ట్‌ను చూసుకోవచ్చు. అలాగే, మార్క్స్ మెమో మరియు ర్యాంక్ కార్డును కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa