జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ ధోవల్ ఇవాళ 80వ సీఆర్‌పీఎఫ్ వార్సికోత్సవ పరేడ్‌లో పాల్గొన్నారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఇటీవల పుల్వామా ఉగ్రదాడిలో మృతిచెందిన అమరవీరులకు ధోవల్ నివాళి అర్పించారు. పుల్వామా ఘటనను ఈ దేశం మరిచిపోలేదు అని, అది ఎన్నటికీ జరగదు అని ధోవల్ అన్నారు. పుల్వామా ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa