ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు ఎట్టకేలకు అవకాశం వచ్చింది. ప్రధానితో భేటీకి అపాయింట్‌మెంట్ ఫిక్స్ అయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. శనివారం ఢిల్లీకి వెళ్లనున్న నారా లోకేష్.. ప్రధాని మోదీతో సాయంత్రం సమావేశం కానున్నారు. ఇందుకోసం రేపు హైదరాబాద్‌కు చేరుకుని.. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే గతంలో ప్రధాని మోదీ ఏపీకి వచ్చినపుడు.. తనను ఢిల్లీకి వచ్చి కలవాలని నారా లోకేష్‌కు సూచించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం గత కొన్ని రోజులుగా నారా లోకేష్ ఎదురుచూస్తుండగా.. ఇప్పటికి వచ్చినట్లు సమాచారం. అయితే ప్రధాని మోదీతో నారా లోకేష్ భేటీలో కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఏపీలో రెండు సార్లు పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాలకు సంబంధించిన పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈనెల 2వ తేదీన ప్రధాని మోదీ.. ఏపీకి వచ్చారు. అమరావతిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయగా.. ప్రధాని మోదీ ప్రసంగించారు.
అంతకుముందు ఈ ఏడాది మొదట్లో కూడా ప్రధాని మోదీ.. ఏపీలో పర్యటించారు. మూడోసారి ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తర్వాత.. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారి నరేంద్ర మోదీ జనవరి 8వ తేదీన విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు వర్చువల్‌గా చేశారు. రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులతోపాటు విశాఖ రైల్వేజోన్ ప్రధాన కేంద్రానికి పునాది రాయి వేశారు. అయితే ఈ రెండు పర్యటనల కోసం ఆంధ్రప్రదేశ్‌కు విచ్చేసిన సమయంలో ఢిల్లీకి వచ్చి తనను కలవాల్సిందిగా ప్రధాని మోదీ నారా లోకేష్‌ను ఆహ్వానించినట్లు సమాచారం.
![]() |
![]() |