ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారికి ఐపీఎల్ టీమ్ యజమాని భారీ విరాళం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 16, 2025, 07:52 PM

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఆ వెంకన్నకు వారి స్థోమతకు తగిన విధంగా కానుకల్ని, విరాళాలను అందజేస్తుంటారు. శ్రీవారికి సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు భారీగా విరాళాలను, కానుకల్ని అందజేస్తుంటారు. తాజాగా RPSG Group అధినేత, ఐపీఎల్ టీమ్‌ లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ సంజీవ్ గోయెంకా తిరుమల శ్రీవారి ఖరీదైన కానుల్ని అందజేశారు. శుక్రవారం ఆయన వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.


సంజీవ్ సంజీవ్ గోయెంకా తిరుమల శ్రీవారికి భారీ కానుల్ని అందజేశారు.. స్వామివారికి ఐదు కేజీల బంగారంతో కటి హస్తం (నడుము భాగం అలంకరించే ఆభరణం) , వరద హస్తాలు (దయచూపే భుజానికి సంబంధించిన ఆభరణం) అందజేశారు. వీటి విలువ రూ.ఏడు కోట్ల ఉంటుందని చెబుతున్నారు. టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి ఆభరణాలను అందజేశారు.. ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం వేదపండితులు సంజీవ్ సంజీవ్ గోయెంకాకు ఆశీర్వచనాలు అందజేయగా.. టీటీడీ అధికారులు శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించి.. తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని.. స్వామివారికి ఆభరణాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి దివ్యదర్శనం కలగడం, స్వయంగా ఆయనకు సేవ చేయడం అనేది తన జీవితంలో ఎంతో గొప్ప సందర్భం అన్నారు. సంజీవ్ గోయెంకా ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ యజమాని.. ప్రముఖ వ్యాపారవేత్త.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వ్యాపారాలు ఉన్నాయి. ఈ మేరకు తిరుమల శ్రీవారిని దర్శించుకుని.. స్వామికి ఆభరణాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.


తిరుమల శ్రీవారికి ఎన్నారై భారీ విరాళం


'అమెరికాలోని బోస్టన్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు శ్రీ ఆనంద్ మోహన్ భాగవతుల గురువారం టిటిడిలోని వివిధ ట్రస్టులకు రూ.1.40 కోట్లకు పైగా విరాళాన్ని అందించారు. తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంప్ కార్యాలయంలో టిటిడి చైర్మన్ శ్రీ బీ ఆర్ నాయుడుకు విరాళాలకు సంబంధించిన డిడిలను దాత అందజేశారు' అని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.


ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు,


రూ.1,00,01,116.


ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు


రూ. 10,01,116,


ఎస్వీ విద్యా దాన ట్రస్ట్‌కు


రూ.10,01,116,


ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్ట్‌కు,


రూ. 10,01,116,


ఎస్వీ సర్వశ్రేయస్ ట్రస్ట్‌కు


రూ.10,01,116.


టీటీడీలోని వివిధ ట్రస్ట్ లకు విరాళాలు అందించిన దాతను టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు అభినందించారు' అని టీటీడీ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com