ఆపరేషన్ సిందూర్ విజయవంతం చేసిన సైనిక దళాలకు సంఘీభావంగా శుక్రవారం సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి నేతలు తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు ర్యాలీ సాగింది త్రివిధ దళాలకు మద్దతుగా నిర్వహించిన ఈ తిరంగా ర్యాలీలో వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయిన సందర్భంగా బీజేపీ చేపట్టిన దేశవ్యాప్త 'తిరంగ యాత్ర' లో భాగంగా నేడు ఏపీలో భారీ యాత్ర ఘనంగా నిర్వహించారు. సుమారు 5000 మంది పాల్గొన్న ఈ యాత్రలో జాతీయ జెండాలు చేపట్టి, దేశభక్తి నినాదాలు ఇస్తూ.. భారత సైనికులకు మద్ధతు తెలిపారు
![]() |
![]() |