పానాజి : గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రమోద్ సావంత్ నేడు బలపరీక్షను ఎదుర్కోనున్నారు. నేడు శాసనసభలో బిజెపికి చెందిన ప్రమోద్ సావంత్ బలపరీక్షను ఎదుర్కోనున్నారు. గోవాలో అధికార బిజెపి గోవా ఫార్వర్డ్ పార్టీ, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరణంతో శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రమోద్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. గోవా ఫార్వర్డ్ పార్టీకి చెందిన విజయ్ సర్దేశాయ్, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ నేత సుదిన్ ధవలికర్‌లను ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa