ప్రేమ, పెళ్లి పేరిట బాలికను శారీరకంగా లొంగదీసుకుని మోసం చేసిన నెల్లిమర్ల మండలంలోని కొండవెలగాడ గ్రామానికి చెందిన పి.నారాయణ(25)పై నెల్లిమర్ల పోలీసులు మంగళవారం పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నారాయణకు ఇదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని ఆ బాలికను నమ్మించి గర్భవతిని చేసి ఆ తర్వాత అబార్షన్ చేయించాడు. పెళ్లికి ససేమిరా అనడంతో నెల్లిమర్ల పోలీసులను బాలిక ఆశ్రయించింది. దాంతో నెల్లిమర్ల పోలీసులు నారాయణపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa