కైలాస మానస సరోవర్ యాత్రీకులు మార్గమధ్యలో చిక్కుకుపోయారు. యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడడంతో రోడ్డు బ్లాక్ అయిందని, యాత్రీకులు ముందుకు వెళ్లే పరిస్థితి లేదని అధికారులు తెలిపారు. దాదాపు 180 మంది యాత్రీకులు చిక్కుకుపోయారని చెప్పారు. అయితే, ఈ ఘటనలో యాత్రీకులు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. సమాచారం అందుకున్న బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సిబ్బంది రంగంలోకి దిగి రోడ్డును క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. రోడ్లపై పడిపోయిన శిథిలాలను తొలగిస్తున్నట్లు చెప్పారు.ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోరాగఢ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2020లో కరోనా మహమ్మారి కారణంగా కైలాస మానస సరోవర్ యాత్రను అధికారులు నిలిపివేశారు. కరోనా తగ్గినప్పటికీ గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల కారణంగా భారత్, చైనా దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో ఈ యాత్రను పునరుద్ధరించలేదు. ఇటీవల ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల ఫలితంగా మానస సరోవర్ యాత్రను ఐదేళ్ల తర్వాత ఈ ఏడాదే తిరిగి ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa