గజపతినగరం మండలంలోని భూదేవి పేట గ్రామంలో వెలసిన మహిమాన్వితమైన ఆంజనేయస్వామి ఆలయానికి నిత్యధూపదీప నైవేద్యానికి అదే గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు కనకల చంద్రరావు కుటుంబ సభ్యులు గురువారం రూ.50వేల విరాళం అందజేశారు. ఈ విరాళాన్ని గ్రామ సర్పంచ్ కనకల ప్రవీణ ఉప సర్పంచ్ జగ్గినేని సన్యాసములకు అందజేశారు. కార్యక్రమంలో జగ్గినేని సత్తిబాబు, డంక సుధాకర్ మద్దుల సత్యం జరజాపు రమణ, కనకల సుబ్రహ్మణ్యంపాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa