రాయలసీమ ప్రజలు అద్భుత చైతన్యంతో మొన్న ఎన్నికల్లో పదికి 7 సీట్లతో కడపలో తమను గెలిపించారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సారి ప్రజలకు మరింత మంచి చేసి రాయలసీమలో పదికి పది సీట్లను మనం గెలుద్దామని సీఎం చంద్రబాబు కార్యకర్తలు నేతలకు వెల్లడించారు. మంగళవారం కడపలో టీడీపీ నిర్వహిస్తున్న 'మహానాడు'లో ఆయన మాట్లాడారు. ఏమీ ఆశించకుండా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తల వల్లే ఈ విజయం సాధ్యమైందని చంద్రబాబు అన్నారువైసీపీ విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిందని, పాలనంటే హత్యా రాజకీయాలు, కక్షసాధింపులుగా గత ప్రభుత్వం మార్చేసిందని TDP అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. "మన పసుపు సింహం, కార్యకర్త చంద్రయ్యను పీక కోస్తుంటే కూడా జై తెలుగుదేశం అని ప్రాణం వదిలాడు. ఆయనే మనకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తే పార్టీని నడిపిస్తుంది. ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని అభినందిస్తున్నా." అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa