ఆపరేషన్ సిందూర్ గురించి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. మన తల్లులు, సోదరీమణుల నుదుటిపై ఉండే ఆ సిందూర రేఖ ఎంత ముఖ్యమో ప్రపంచానికి చాటిచెప్పామని వ్యాఖ్యానించారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై దాడులు నిర్వహించి.. దేశం గర్వపడేలా చేశాం. మోదీకి మాత్రమే అది సాధ్యం. దేశంలో శాంతిభద్రతలకు భంగం కలిగించాలనుకున్నవారిప్పుడు బాధతో మూలుగుతున్నారు’ అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa