భారత సైన్యంలో ఉద్యోగం కోసం ఉత్సుకతగా ఎదురుచూస్తున్న క్రీడాకారులకు శుభవార్త. భారత సైన్యం తాజాగా స్పోర్ట్స్ కోటా ద్వారా హవల్దార్, నాయబ్ సుబేదార్ హోదాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి (టెన్త్ క్లాస్/మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
అభ్యర్థులు 17.5 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో క్రీడా ప్రదర్శనల ద్వారా ప్రతిభను చాటినవారే ఈ కోటా ద్వారా దరఖాస్తు చేసుకునే అర్హత పొందుతారు.
ఎంపిక విధానం:
అభ్యర్థులను ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ల ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆసక్తిగల అభ్యర్థులు 2025 జూన్ 15 లోగా అధికారిక వెబ్‌సైట్ www.joinindianarmy.nic.in ద్వారా ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ అవకాశం భారత సైన్యంలో సేవ చేసే లక్ష్యంతో ఉన్న యువ క్రీడాకారులకు గోల్డెన్ ఛాన్స్‌గా చెప్పుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa