మంత్రి పార్థసారధి పేదలకు శుభవార్త చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గృహనిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ విచారణ కొలిక్కి వచ్చిందని మంత్రి తెలిపారు. త్వరలోనే తప్పులు చేసిన వారిపై తగిన చర్యలు ఉంటాయని వెల్లడించారు. జూన్ చివరినాటికి 3 లక్షల మంది పేదలకు నాణ్యతలో రాజీ పడకుండా ఇళ్లు ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. చంద్రబాబు దార్శనికతతో రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కిస్తున్నారని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa