ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పట్టుచీరలు మెరుపు తగ్గకుండా కొత్తవాటిలా ఉండాలంటే..

Life style |  Suryaa Desk  | Published : Wed, Jun 11, 2025, 04:20 PM

పెళ్లిళ్లు,పార్టీల సీజన్‌ వచ్చిందంటే ఏ చీర కట్టుకోవాలి అనేది పెద్ద ప్రశ్న. చీర ఉంటే, సమయానికి మ్యాచింగ్‌ బ్లౌజు కనిపించదు. అంతేకాదు రెండింటికీ తగ్గట్టు జ్యుయల్లరీ వెతుక్కోవాలి.అన్నీ బావున్నాయి అంటే.. మనకు నచ్చిన పట్టుచీర మరక వెక్కిరిస్తుంది. మరి పట్టుచీరపై మరకలుపడితే ఏం చేయాలి? పట్టుచీరలు మెరుపు తగ్గకుండా కొత్తవాటిలా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. పట్టు చీరపై నూనె మరక పడితే..? పట్టు చీర కట్టుకున్నప్పుడు పూజలు వంటి ప్రత్యేక సందర్భాలలో నూనె చుక్కలు పడటం సహజమే. నూనె మరక పడిన వెంటనే శుభ్రమైన పొడి కాటన్‌ బట్టతో ఆ ప్రదేశంలో అద్దాలి. బట్ట లేకపోతే పేపర్, టవల్‌ తో కూడా నూనె పడిన చోట అద్దవచ్చు. అయితే ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే మరక పడిన చోట గట్టిగా రుద్దితే మిగతా చోట్లకు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే నూనె పీల్చుకుని ఆ ప్రదేశంలో మరక పోవడం మొదలవుతుంది. నూనె పడిన చోట మాత్రమే మెల్లగా అద్ది మరకను తొలగించాలి. ఇలా వస్త్రం లేదా పేపర్‌ టవల్‌ తో అద్దిన తర్వాత అక్కడ పౌడర్‌ చల్లి శుభ్రం చేయాలి. పౌడర్‌ చల్లి మరక పడిన చోటును నీటితో కడిగితే చాలు. పేరుకు పోయిన నూనె, మురికి అంతా పోతుంది. పొరపాటున కూడా వేడి నీటితో మరకలను తొలగించడానికి ప్రయత్నించవద్దు. వేడి నీరు పడితే మరక పోనే పోదు. మరక ఉన్న చోట బేకింగ్ సోడా లేదా కార్న్‌స్టార్చ్‌ను పలుచగా చల్లి కొద్దిసేపటి తర్వాత, వేరే ఏదైనా బట్టతో తుడిచివేసి, మళ్ళీ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వెనిగర్ లేదా నిమ్మరసం తీసుకొని కొద్దిగా నీరు కలిపి, సున్నితమైన బట్టతో మరక ఉన్న ప్రాంతాన్ని తుడవాలి. పట్టు చీరలను శుభ్రం చేసిన తర్వాత, వాటిని నీడలో ఆరనివ్వాలి. ఇదీ మీ ముఖం చందమామలా మెరవాలంటే..! ఎలా శుభ్రం చేయాలంటే.. ఖరీదైన చీరలను సాధ్యమైనంత వరకు ఇంట్లో వాష్‌ చేయకపోవడమే మంచిది. డ్రై క్లీనింగ్ లేదా ఇతర ప్రొఫెషనల్ క్లీనింగ్ సేవలను ఉపయోగించుకోవాలి. పట్టు చీరలను మడతపెట్టేటప్పుడు, జాగ్రత్తగా మడతపెట్టి, పొడి గాలి తగిలేలా చేయాలి. అలాగే బంగారు, వెండి జరీ చీరలను మెత్తటి కాటన్‌ బట్టలో చుట్టి ఉంచడం మంచిది. సంవత్సరాల తరబడి ఒకే మడతల్లో చీరలను అలా ఉంచేయకూడదు. మధ్యమధ్యలో గాలికి ఆరనిచ్చి,మడతలు మార్చిపెట్టుకోవాలి. పట్టు చీరలను శుభ్రం విషయంలో ఏదైనా అనుమానాలుంటే ఎక్స్‌పర్ట్‌ సలహా తీసుకోవడం ఉత్తమం. మగ్గం వర్క్‌ బ్లౌజులను ఉల్టా చేసిన మడతపెట్టుకునొ భద్రపరుచుకోవాలి. లేదంటే స్టోన్స్‌, కుందన్స్‌ ఊడిపోయి, అందం పోతుంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa