ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నింటికీ ఒక్కటే ఆసనం, ,,,మీ సమస్యలన్నీ మాయం

Life style |  Suryaa Desk  | Published : Sun, Jun 15, 2025, 12:20 AM

ప్రతిరోజు ఉదయం నిద్రలేచి యోగా చేయడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వివిధ రకాల యోగాసనాలు శరీరంలోని వివిధ భాగాలను లక్ష్యంగా చేసుకుని వాటిని ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడతాయి. ఈ రోజు అలాంటి ఒక యోగాసనం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఆసనం శరీరానికి ఎన్నో ప్రయోజనాల్ని అందిస్తుంది. ఆ ఆసనమే కౌపోజ్.. తెలుగులో గోముఖాసనం అంటారు. యోగాలో ఇది సులభమైన, ప్రాథమిక ఆసనం. వెన్నెముకకు (ముఖ్యంగా దిగువ వీపు భాగానికి), పొత్తికడుపుకు, ఛాతీకి ఈ ఆసనం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. గోముఖాసనం వల్ల కలిగే ప్రయోజనాలు, ఎలా వేయాలి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


వెన్నెముకను సరళంగా చేస్తుంది


నేటి బిజీ జీవనశైలి కారణంగా, నడుము, వెన్నెముకలో దృఢత్వం ఒక సాధారణ విషయంగా మారింది. దీంతో, నడుము, వెన్నెముక నొప్పితో చాలా మంది బాధపడుతున్నారు. అలాంటి వారికి గోముఖాసనం మంచి ఆప్షన్. గోముఖాసనం ఈ సమస్య నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది. ఈ ఆసనం చేయడం ద్వారా, వెన్నెముక ఫ్లెక్సిబులిటీ పెరుగుతుంది. ఇది వెన్నెముకను సరళంగా చేస్తుంది. ఈ ఆసనం వెన్నునొప్పి, గర్భాశయ సమస్యల నుంచి రిలీఫ్ అందిస్తుంది.


భుజాలు, ఛాతీని బలపరుస్తుంది


ఈ ఆసనంలో, చేతులను వెనుకకు తీసుకుని కలిపి ఉంచుతారు. ఇది భుజాలు, ఛాతీ కండరాలను సాగదీస్తుంది. ఈ ఆసనం క్రమం తప్పకుండా చేయడం వల్ల భుజాలు బలపడతాయి. అంతేకాకుండా శరీర భంగిమ మెరుగుపడుతుంది . ఎక్కువసేపు డెస్క్ వద్ద కూర్చుని పనిచేసే వారికి గోముఖాసనం బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు.


ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది


ఈ రోజుల్లో చాలా మంది ఒత్తిడి, ఆందోళన సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు రోజూ గోముఖాసనం చేయాలని నిపుణులు అంటున్నారు. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సాయపడుతుంది. ఈ ఆసనం సమయంలో లోతైన శ్వాస తీసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీంతో, మెదడు విశ్రాంతి పొందుతుంది. ఇది థైరాయిడ్ గ్రంథిని కూడా సక్రియం చేస్తుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.


జీర్ణవ్యవస్థకు మేలు


గోముఖాసనం వల్ల ఉదర కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది జీర్ణవ్యవస్థను సక్రియం చేస్తుంది. ఇది మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం అందించడంలో సాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆసనం వేయడం వల్ల జీర్ణక్రియ మరింత మెరుగుపడుతుంది.


కీళ్ల నొప్పి నుంచి ఉపశమనం


గోముఖాసనము తుంటి, మోకాళ్ళు, చీలమండలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఆసనం క్రమం తప్పకుండా చేయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఆర్థరైటిస్ వంటి సమస్యలలో ఉపశమనం లభిస్తుంది. ఇది శరీరంలోని వివిధ భాగాలలో రక్త ప్రసరణను కూడా పెంచుతుంది.


గోముఖాసనం ఎలా వేయాలి?


* మొదట, మీ చేతులు, మోకాళ్ళపై ఆల్ ఫోర్స్‌లో (నాలుగు కాళ్ల స్థితిలో) కూర్చోండి. భుజాలు మీ మణికట్టుకు (wrists) నేరుగా పైన.. తుంటి, మోకాళ్ళకు నేరుగా పైన ఉండేలా చూసుకోండి.


* చేతి వేళ్ళు వెడల్పుగా తెరిచి, అరచేతులు నేలకు గట్టిగా నొక్కి ఉంచండి.


* మోకాళ్ళ మధ్య తుంటి వెడల్పు దూరం ఉండేలా చూసుకోండి.


* వీపును నిటారుగా, సమతలంగా ఉంచండి. మీ తల, వెన్నెముకకు అనుగుణంగా ఉండాలి.


* ఆ తర్వాత నెమ్మదిగా శ్వాస లోపలికి తీసుకుంటూ (పీల్చుకుంటూ), మీ నడుము భాగాన్ని కిందకు వంచండి.


* అదే సమయంలో, మీ తల, ఛాతీని పైకి లేపండి. అంటే ఆకాశం వైపు చూస్తున్నట్లు. చివరగా మెడపై ఎక్కువగా ఒత్తిడి పడకుండా చూసుకోండి.


* నెమ్మదిగా శ్వాసను బయటకు వదలండి. ఈ ఆసనం రెగ్యులర్‌గా చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa