కర్ణాటకలో బైక్ ట్యాక్సీ సేవలు సోమవారం నుంచి నిలిచిపోయాయి. ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ర్యాపిడో, ఉబర్, ఓలా సంస్థలు తమ సేవలను నిలిపి వేస్తున్నట్లు ర్యాపిడో తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. సేవలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని తెలిపింది. బైక్ ట్యాక్సీ సేవలను ఉబర్ మోటో కొరియర్ కింద మార్చగా.. ఓలా తన యాప్‌లో బైక్ ట్యాక్సీ అనే ఆప్షన్‌ను పూర్తిగా తొలగించింది.