పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా కలవరపెట్టినన క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. ఇజ్రాయెల్-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో ముడిచమురు ధరలు 5శాతం మేర తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 3.53డాలర్లు లేదా 4.94శాతం తగ్గి 67.95డాలర్లు వద్ద ట్రేడవుతోంది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ రకం కూడా 5% క్షీణించి బ్యారెల్ 65 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వారం కనిష్ఠానికి చేరాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa