పంజాబ్‌లోని లూధియానాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొత్త డ్రమ్ములో గుర్తుతెలియని వ్యక్తి శవం కనిపించడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. మెడ మరియు కాళ్లు తాడుతో కట్టిన స్థితిలో శవం ఉండటం, చుట్టూ దుర్వాసన వ్యాపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు ఈ ఘటనను పథకం ప్రకారం జరిగిన హత్యగా భావిస్తున్నారు. మృతుడు వలస కార్మికుడై ఉండొచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. శవాన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఈ హత్య వెనుక గల కారణాలను ఆరా తీసేందుకు పోలీసులు ఇంటెన్సివ్ దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా 5 కిమీ పరిధిలోని సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు సేకరించి పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి క్లూస్ లభిస్తాయన్న ఆసక్తి నెలకొంది. స్థానికులు భయాందోళనకు గురవుతుండగా, ఈ కేసును త్వరగా ఛేదించి నిందితులను పట్టుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa