కోల్‌కతా లా కాలేజీ విద్యార్థిని సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా(31) గతంలో మహిళలపై పైశాచికంగా ప్రవర్తించిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో మరో లా విద్యార్థిని అతడిపై తీవ్ర ఆరోపణలు చేసింది. మిశ్రా రెండేళ్ల క్రితం తనను లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించింది. ఈ విషయం గురించి ఎవరికైనా చెప్తే తన కుటుంబం అంతటిని చంపుతానని బెదిరించాడని, అతడికి భయపడి కంప్లెంట్ ఇవ్వలేదని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa