పెంపుడు జంతువులను ఇష్టపడే వారికి సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఊహించని షాక్ ఇచ్చింది. ఇంట్లో ఒక కుక్కను పెంచుకోవాలంటే, ఏకంగా 10 మంది ఇరుగుపొరుగు వారి నుంచి ఎన్ఓసీ తీసుకోవాలంటూ కొత్త నిబంధనను తెరపైకి తెచ్చింది. ఈ మేరకు అధికారులు కీలక ఉత్తర్వులు జారీ చేశారు.ఈ నిబంధన కేవలం ఇండిపెండెంట్ ఇళ్లకే పరిమితం కాదు. బహుళ అంతస్తుల భవనాల్లో నివసించే వారైతే, ఆ భవన సంక్షేమ సంఘం ఛైర్పర్సన్, కార్యదర్శి నుంచి కూడా తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని కార్పొరేషన్ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ రెండు పత్రాలను సమర్పిస్తేనే పెంపుడు కుక్కను ఇంట్లో ఉంచుకునేందుకు వీలుంటుంది.ఈ కఠినమైన నిబంధనలను తీసుకురావడానికి గల కారణాన్ని కూడా అధికారులు వివరించారు. గత మే నెలలో నగరంలో ఓ చిన్నారి కుక్క దాడిలో ప్రాణాలు కోల్పోయిందని, అటువంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని మున్సిపల్ అధికారులు తెలిపారు. ఈ కొత్త నిబంధన స్థానికంగా పెంపుడు జంతువుల యజమానుల్లో చర్చనీయాంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa