పాకిస్థాన్-రష్యా మధ్య రైలు మార్గం ఏర్పాటుకు రెండు దేశాలు అంగీకరించాయి. మధ్యాసియా దేశాలతో పాక్‌ను అనుసంధానించే రైలు, రోడ్డు నెట్వర్క్ నిర్మాణానికి రష్యా సహకరించనుంది. రష్యాతో కుదిరిన ఈ ఒప్పందం పాకిస్థాన్‌ను వ్యూహాత్మక అంతర్జాతీయ రహదారి కూడలిగా మార్చుతుందని స్థానికులు భావిస్తున్నారు. ప్రపంచ దేశాలతో వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు విస్తరించేందుకు ఇది చక్కని అవకాశం అని పాక్ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa