చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అణచివేతలపై వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రశ్నించే గొంతులను నులిమేస్తున్నారంటూ శనివారం తన ఎక్స్ ఖాతాలో ఆయన ఓ పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం, నిరసనలు తెలియజేడం, సమావేశాలు నిర్వహించుకోవడం.. బలమైన పునాదులు. అలాంటిది పునాదులను ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం నాశనం చేసే ప్రయత్నంలో ఉందని వైయస్ జగన్ మోహన్‌రెడ్డి మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa