airtel వినియోగదారులను ఆకట్టుకునేలా రూ.349 ప్లాన్‌తో అదిరే ఆఫర్ ప్రకటించింది. ఈ ప్లాన్‌లో 28 రోజుల పాటు అన్లిమిటెడ్ 5G డేటా, ప్రతి రోజు 2GB 4G డేటా, 100 ఉచిత SMSలు లభిస్తాయి. డేటా వేగం పూర్తయిన తర్వాత స్పీడ్ తగ్గినా సేవలు కొనసాగుతాయి. అధిక డేటా వాడేవారికి, వేగవంతమైన కనెక్షన్ కోరేవారికి ఈ ప్లాన్ ఆకర్షణీయంగా మారింది.
25 శాతం క్యాష్ బ్యాక్ పొందండిలా..
ఈ క్యాష్ బ్యాక్ కోసం యూజర్లు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వరా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రీఛార్జ్ కోసం ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చెల్లించినట్లయితే ఫ్లాట్ 25 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అదే సమయంలో ఇతర రీఛార్జ్ లపై కూడా 10 శాతం క్యాష్ బ్యాక్ ప్రయోజనాన్ని అందిస్తోంది. ఈ క్యాష్ బ్యాక్ 60 రోజుల్లో ప్రాసెస్ అయి నేరుగా క్రెడిట్ స్టేట్ మెంట్ లో ప్రతిబింబిస్తుంది.