ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోడే వెంకట్రావు ట్రస్ట్: సేవలకు దిశానిర్దేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 11, 2026, 01:59 PM

నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలోని గోడే వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో బుధవారం ట్రస్ట్ చైర్మన్ చెరుకూరు వెంకటాద్రినాయుడు అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భవిష్యత్తులో చేపట్టబోయే వ్యవసాయ పరికరాల పంపిణీ, బ్లడ్ క్యాంపులు, కంటి వైద్య శిబిరాల నిర్వహణపై చర్చించారు. కుల మతాలకు అతీతంగా పనిచేయాలని, ప్రజల విన్నపాలకు తక్షణమే స్పందించాలని వేంకటాద్రి నాయుడు సభ్యులకు సూచించారు. ట్రస్ట్ సేవలకు లభిస్తున్న ఆదరణ పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa