గడిచిన 20 నెలల్లో పాలనలో కీలకమైన మార్పులు తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు. బుధవారం సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘2047 స్వర్ణాంధ్ర విజన్‌లో భాగంగా 10 సూత్రాల అమలు తీసుకొచ్చాం. నిర్దేశిత లక్ష్యాలను క్షేత్ర స్థాయిలో ప్రభావవంతంగా అమలు చేయాలి. ‘‘ఉగాది కానుకగా 2.50 లక్షల లబ్ధిదారులకు సామూహిక గృహప్రవేశాలు చేయిస్తాం. గత పాలనలో ట్రూఅప్ పేరిట విద్యుత్ ఛార్జీల భారం వేస్తే.. మేం ట్రూడౌన్ చేశాం. రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం’’ అని తెలిపారు.ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. అధికారులు-ప్రజాప్రతినిధుల కార్యక్రమాలపై సీఎం కార్యాచరణ ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa