ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగాది నాడు సామూహిక గృహప్రవేశ కార్యక్రమం నిర్వహిస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 11, 2026, 03:28 PM

ఉగాది కానుకగా రాష్ట్రంలో సామూహిక గృహప్రవేశ కార్యక్రమం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.50 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని ఆయన తెలిపారు. ఈ రోజు సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనలో గడిచిన 20 నెలల్లో కీలకమైన పాలనా మార్పులు తీసుకొచ్చినట్లు చెప్పారు. 2047 స్వర్ణాంధ్ర విజన్‌లో భాగంగా 10 సూత్రాల అమలు తీసుకొచ్చామని గుర్తుచేశారు.ప్రభుత్వం తీసుకొచ్చే విధానాలు, పథకాలు దీర్ఘకాలంలో ప్రభావం చూపిస్తాయని.. సూపర్‌ సిక్స్‌ సహా వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలని, పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచించారు. నిర్దేశిత లక్ష్యాలను క్షేత్రస్థాయిలో ప్రభావవంతంగా, ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా అమలు చేయాలని చెప్పారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa