జియోబ్లాక్‌రాక్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లాంచ్ చేయడానికై సెబీ అధికారిక ఆమోదం ఇచ్చింది.
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు బ్లాక్‌రాక్ కలిసి ఏర్పాటుచేసిన జాయింట్ వెంచర్ అయిన ఈ కంపెనీ ఐదు కొత్త స్కీమ్స్ తీసుకొచ్చేందుకు ఆమోదం పొందింది. జియోబ్లాక్‌రాక్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, జియోబ్లాక్‌రాక్ నిఫ్టీ 8-13 సంవత్సరాల జీ-సెక్ ఇండెక్స్ ఫండ్, జియోబ్లాక్‌రాక్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్, జియోబ్లాక్‌రాక్ నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్, అలాగే జియోబ్లాక్‌రాక్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్ పేర్లతో ఈ మ్యూచువల్ ఫండ్ కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతి దక్కింది. వీటి లో నాలుగు స్కీమ్స్ ఈక్విటీ ఆధారిత ఇండెక్స్ ఫండ్లు కాగా, ఒకటి డెట్ ఫండ్‌గా ఉంటుంది.జులై 7న సంస్థ తన తొలి న్యూఫండ్ ఆఫర్ (NFO)ను విజయవంతంగా ముగించిందని ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా సుమారు రూ.17,800 కోట్లు (సుమారు 2.1 బిలియన్ డాలర్లు) రాబట్టినట్లు తెలిపింది. ఈ నిధులను జియోబ్లాక్‌రాక్ ఓవర్‌నైట్ ఫండ్, జియోబ్లాక్‌రాక్ లిక్విడ్ ఫండ్, జియోబ్లాక్‌రాక్ మనీ మార్కెట్ ఫండ్ వంటి మూడు మ్యూచువల్ ఫండ్ పథకాల ద్వారా సమీకరించబడినట్లు వెల్లడించింది. ఈ మూడు రోజుల NFOలో 90కు పైగా సంస్థాగత పెట్టుబడిదారులు మరియు 67,000కి పైగా రిటైల్ పెట్టుబడిదారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa