ఢిల్లీ స్కూళ్లకు వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా పశ్చిమ విహార్‌లోని రిచ్‌మండ్ గ్లోబల్ స్కూల్‌కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు వెంటనే స్పందించి స్కూల్‌ను ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్ సిబ్బందితో కలిసి గదులు, ప్రాంగణాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని పలు స్కూళ్లకు ఇదే విధంగా బెదిరింపులు రావడం ఆందోళన రేపుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa