తపాలాశాఖ ఆధునిక అప్లికేషన్లు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఈ నెల 21న గుంటూరు డివిజన్‌లోని అన్ని పోస్టాఫీసుల్లో సేవలు నిలిపివేస్తామని అధికారులు గురువారం తెలిపారు. అప్‌గ్రేడ్ చేసిన వ్యవస్థ ద్వారా 22వ తేదీ నుంచి సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సందర్శన తేదీలను మార్చుకొని సహకరించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa