మాజీ మంత్రి ఆర్కే రోజా గారిపై నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ నాయకురాలు విడదల రజిని తీవ్రంగా ఖండించారు. `గాలి భానుప్రకాశ్ మాట్లాడిన దిగజారుడు మాటలు సమాజం లోని మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. టీడీపీ నాయకులు మహిళలను ఎలా అగౌరవంగా చూస్తారో చెప్పడానికి ఆ మాటలే నిదర్శనం. కనీసం ఇప్పటికైనా ఆ ఎమ్మెల్యే తప్పుని ఒప్పుకుని ఆర్కే రోజా గారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి` అంటూ విడదల రజిని డిమాండ్ చేస్తూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa