ప్రవాసాంధ్రులకు సులభంగా శ్రీవారి దర్శనం లభించనుంది. ఇకపై ప్రవాసాంధ్రులకు రోజూ వంద వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు లభించనున్నాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులకు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో ప్రవాసాంధ్రులకు అందించే వీఐపీ బ్రేక్ దర్శన కోటాను 50 నుంచి 10కి తగ్గించారు. ఈ విషయాన్ని ఏపీ ప్రవాసాంధ్రుల సొసైటీ (ఏపీఎన్ఆర్‌టీ) అధ్యక్షుడు రవి వేమూరి ఆధ్వర్యంలో ఆ సంస్థ ప్రతినిధులు ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వీఐపీ బ్రేక్ దర్శన కోటా తగ్గడం వల్ల విదేశాల నుంచి వచ్చే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు. ఈ విషయంపై స్పందించిన సీఎం కోటాను 10 నుంచి 100కి పెంచారు. ప్రవాసాంధ్రులకు రోజూ వంద వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు ఇవ్వాలని టీటీడీ అధికారులను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa